Global Vaartha
Date of Publish : 21/10/2026, 4:53 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి టిడిపి నాయకులు పై ధ్వజమెత్తారు

  • ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసేలా కూటమి నాయకుల తీరు
  • వైసీపీ నేతలు టార్గెట్ గా దాడులు అరాచకాలు

ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసేలా కూటమి నాయకులు ప్రవర్తిస్తున్నారని,

వైసీపీ నేతలు ఆస్తులు వైసీపీ నేతలు టార్గెట్ చేసి దాడులు అరాచకాలు పాల్పడుతున్నారని జిల్లా ఎంపీ అవినాష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన పత్రికముకంగా మాట్లాడుతూ గత,

వారం రోజులుగా పులివెందులతో పాటు అనేక ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు.

నామినేషన్ వేయాలంటే, నామినేషన్ పరిశీలన పూర్తి చేసుకోవాలంటే యుద్ధం చేయాల్సిన పరిస్థితి, వీటన్నిటి నుంచి బయటపడిన ప్రయోజనం లేదు,

ప్రశాంతంగా స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే పరిస్థితి లేదు,నాలుగు రోజుల క్రితం పులివెందులలో ఒక చికెన్ సెంటర్ ను తగలబెడుతున్న దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయి ఇప్పటివరకు నిందితులపై చర్యలు తీసుకోలేదు,ఆ షాపును తగలబెట్టిన టిడిపి నాయకులు ఆక్కుల గారి విజయ్ కుమార్ రెడ్డి, షామీరని స్పష్టంగా తెలుస్తున్న ఎందుకు అరెస్టు చేయలేదు,

కౌన్సిల్ అభ్యర్థి నిరంజన్ రెడ్డి చెందిన ట్రక్కులను కాల్చివేశారు,

ఇంత స్పష్టంగా దాడులు గురించి సమాచారం తెలుస్తున్న పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..పోలీసుల దగ్గరుండి ప్రోత్సహిస్తూ ఈ దాడులు చేయిస్తున్నారన్న అనుమానం మాకు కలుగుతోందని,

పోలీసులు అధికార యంత్రం ఇంత ఊడిగం చేయాల్సిన అవసరం ఎందుకొస్తుందో అని ప్రశ్నిస్తున్నాం,ఒకరీద్దరీని భయపడితే ప్రచారం చేసుకోకుండా భయపడి వెనక్కి వెళ్తారని వాళ్ళ ఆలోచన,మరో అభ్యర్థి బైక్ కాల్చారు ఇంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు ప్రయత్నించారు.

స్థానికులు మేలుకోడంతో అక్కడినుంచి పారిపోయారు.

నామినేషన్ కేంద్రం వద్ద జరిగిన ఘటన సంబంధించి దాదాపు 900 మంది పైన కేసులు పెట్టారు.సంబంధం లేని అరెస్టు చేస్తున్నార అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైయస్ మనోహర్ రెడ్డి వైఎస్ఆర్సిపి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save