Global Vaartha
Date of Publish : 21/10/2026, 5:02 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు

  • ప్రజాస్వామ్యబద్ధంగా నామినేషన్ వేసే హక్కును కల్పించాలి
  • నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న పోలీసులు

ప్రజాస్వామ్యబద్ధంగా నామినేషన్ వేసే హక్కును కల్పించాలని పులివెందులఎంపీడీవో కార్యాలయం ఎదుట వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, రోడ్డుపై బైఠాయించి ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా పులివెందులలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.బుధవారం పులివెందుల ఎంపీడీవో కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నాయకులు భారీ నిరసన చేపట్టారు.తుమ్మలపల్లె,నల్లపురెడ్డిపల్లె,కొత్తపల్లె,ఎర్రిపల్లె గ్రామాల నుంచి నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను పోలీసులు గేటు ముందే అడ్డుకున్నారు.నిబంధనల ప్రకారం నామినేషన్ వేసేందుకు అనుమతించాలని కోరినప్పటికీ అధికారులు, పోలీసులు నిరాకరించడంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.పోలీసుల ఏకపక్ష వైఖరికి నిరసనగా అభ్యర్థులు,నాయకులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నామినేషన్ వేసే హక్కును కాలరాస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save