Global Vaartha
Date of Publish : 21/10/2026, 5:50 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ప్రజాస్వామ్య ఎన్నికలు నిర్వహించాలి RSF రాష్ట్ర అధ్యక్షులు డి.యం. ఓబులేసు యాదవ్

  • జడ్పీటీసీ నామినేషన్ ప్రక్రియకు అడ్డంకులు సృష్టించడం ప్రజాస్వామ్య హక్కులకు విఘాతం
  • నామినేషన్ ప్రక్రియను అడ్డుకునే అధికారం కూటమి నేతలకు ఎవరిచ్చారు?

జడ్పీటీసీ ఎన్నికల్లో తన నామినేషన్ పత్రాల పరిశీలన, అభ్యర్థిత్వాన్ని కొనసాగించే ప్రక్రియలో రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లకుండా అడ్డంకులు సృష్టించారని,అభ్యర్థి నామినేషన్ ప్రక్రియలో రాజకీయ నేతలు జోక్యం చేసుకొని అడ్డుకోవడానికి వారికి అధికారం ఎవరిచ్చారని RSF రాష్ట్ర అధ్యక్షులు డి.యం. ఓబులేసు యాదవ్ ప్రశ్నించారు

కడప జడ్పీ హాల్ వద్ద ఖాజీపేట జడ్పీటీసీ నామినేషన్ వేయడానికి వేళ్తుండగా RSF డి.యం. ఓబులేసు యాదవ్ నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కొని కూటమి నేతలు చించివేసి రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారని ఇది కూటమి ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్టన్నారు

ఈ సందర్భంగా RSF డి.యం. ఓబులేసు యాదవ్ మాట్లాడుతూ

స్థానిక సంస్థల ఎన్నికలను అధికార కూటమి ఏకపక్ష రాజకీయాలకు వేదికగా మార్చే ప్రయత్నం చేయడం సరికాదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే నిర్ణేతలని, రాజకీయ నాయకులు కాదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడం ప్రతి అర్హుడైన పౌరుడికి రాజ్యాంగబద్ధంగా లభించిన ప్రజాస్వామ్య హక్కు అని, ఆ హక్కుకు ఆటంకాలు కలగకుండా ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, పారదర్శకంగా సాగాలని అన్నారు.

ఎన్నికల వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే ప్రయత్నాలను సహించేది లేదని ఓబులేసు యాదవ్ హెచ్చరించారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అభ్యర్థిత్వంపై నిర్ణయం వంటి ప్రక్రియలు ఎన్నికల నిబంధనల ప్రకారం సంబంధిత ఎన్నికల అధికారులు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు.

కాబట్టి, తన నామినేషన్‌కు సంబంధించిన పరిణామాలపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనల ప్రకారం న్యాయం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆయన డిమాండ్ చేశారు. జడ్పీటీసీ ఎన్నికలు ఎలాంటి రాజకీయ జోక్యానికి తావులేకుండా, నిష్పక్షపాతంగా జరిగేలా ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు.

“ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు… రాజకీయ నేతలు కాదు. నామినేషన్ ప్రక్రియకు అడ్డంకులు సృష్టించడం ప్రజాస్వామ్య ఎన్నికలకు గొడ్డలిపెట్టు” అని డి.యం. ఓబులేసు యాదవ్ తెలిపారు

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save