Global Vaartha
Date of Publish : 21/10/2026, 6:50 pm
Editor : భవ్య జర్నలిస్ట్

సింహాద్రిపురంలో ఎంపీటీసీ నామినేషన్ల పర్వం

సింహాద్రిపురం మండల పరిధిలో జరగనున్న ఎంపీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.తొలిరోజు మొత్తం మూడు నామినేషన్లు దాఖలైనట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.​మండలంలోని గురుజాల,తెలికి, హిమకుంట్ల ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు. దాఖలైన వాటిలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తరఫున ఇద్దరు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరఫున ఒక అభ్యర్థి నామినేషన్ వేసినట్లు ఆయన పేర్కొన్నారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రం వద్ద అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save