Global Vaartha
Date of Publish : 21/10/2026, 7:32 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఢిల్లీలో మళ్లీ పెరిగిన వాయు కాలుష్యం.. గ్రాప్‌-1 ఆంక్షలు అమల్లోకి..

  • ఢిల్లీ ప్రజలు తరచూ వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు
  • ఇప్పటికే అనేక సార్లు ఢిల్లీని వణికించిన వాయు కాలుష్యం... తాజాగా మరోసారి విజృంభించింది.

 దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు తరచూ వాయు కాలుష్యం (Air Pollution) ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. ఇప్పటికే అనేక సార్లు ఢిల్లీని వణికించిన వాయు కాలుష్యం... తాజాగా మరోసారి విజృంభించింది. స్థానికంగా వాయు నాణ్యత సూచీ (AQI) దిగజారడంతో ‘సెంట్రల్‌ ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఏక్యూఎం)’ ఈ సీజన్‌లో తొలిసారి ఆంక్షలు విధించింది. ఢిల్లీ - ఎన్‌సీఆర్‌ పరిధిలో ‘గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌-1 నిబంధనలను తక్షణమే అమల్లోకి తీసుకొస్తున్నట్లు సీఏక్యూఎం ప్రకటించింది.ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిన నేపథ్యంలో సెంట్రల్‌ ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ఛైర్‌పర్సన్‌ రాజేశ్‌ వర్మ.. ఉన్నతాధికారులు, పలు ప్రభుత్వ విభాగాలతో సమక్షా సమావేశం నిర్వహించింది. నగరంలో వాయు కాలుష్య సమస్యపై సమీక్షించడంతో పాటు రాబోయే రోజుల్లో కాలుష్య నివారణ చర్యలపై చర్చించారు.ఢిల్లీలో ఈ నెల 20న వాయు నాణ్యత సూచీ 179గా నమోదు కాగా.. ఇవాళ(బుధవారం) మధ్యాహ్నం 2గంటలకు 244కి ఒక్కసారిగా పెరిగిందని సీఏక్యూఎం పేర్కొంది.

రాబోయే రోజుల్లో వాయు నాణ్యత సూచీ ‘పూర్‌’ కేటగిరీలోనే ఉంటుందని ఐఎండీ తెలిపింది. వాయు నాణ్యత మరింతగా క్షీణించకుండా నిరోధించేందుకు జీఆర్‌ఏపీ-1 నిబంధనలను వెంటనే అమలు చేయాలని సీఏక్యూఎం పేర్కొంది. ఈ నిబంధనల కింద గ్రాప్‌-1 కింద హోటళ్లు, రెస్టారెంట్లలో ఇంధనంగా బొగ్గు, వంట చెరకు వాడకూడదు. అలానేఅత్యవసర పరిస్థితుల్లో మాత్రమే డీజిల్‌ జనరేటర్ల వాడకానికి అనుమతించాలని సీఏక్యూఎం స్పష్టం చేసింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save