వైసీపీ వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పతనమైందని తెలిపారు. బుధవారం నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అటు సంక్షేమం.. ఇటు అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందని అన్నారు. ఈ ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం అలవాటుగా పెట్టుకున్నారంటూ వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై నిప్పులు చెరిగారు.సుప్రీంకోర్టు తీర్పును కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారంటూ వైసీపీ సోషల్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, కూటమి నేతలపై వైసీపీ దాడులు చేస్తూ వారే కోర్టును తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రిమినల్ లిటిగెంట్ పార్టీకి సరైన గుణపాఠం చెప్పాలని ప్రజలకు ఆయన సూచించారు. నెల్లూరు రూరల్‌లోని 36 స్థానాల్లో 8 ఏకగ్రీవమయ్యాయని తెలిపారు. మరో 9 స్థానాల్లో వైసీపీ ప్రధాన అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారని చెప్పారు.
డమ్మీ అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారని పేర్కొన్నారు. 17 స్థానాల్లో వైసీపీ పోటీ లేనట్లే అయిందని అన్నారు. నెల్లూరు రూరల్‌లో జెన్‌జీలకు అవకాశం ఇస్తానని తాను ముందే చెప్పానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భీమినేని వేదశ్రీ 44 డివిజన్ నుంచి అవకాశం ఇచ్చామని.. ఆమె ఎన్నిక ఏకగ్రీవమైందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.