Global Vaartha
Date of Publish : 22/10/2026, 10:49 am
Editor : భవ్య జర్నలిస్ట్

ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అరెస్ట్‌

ఏపీలో చంద్రబాబు సర్కార్‌ అరాచక పర్వం కొనసాగుతోంది. కడప వైఎస్సార్‌సీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి పోలీసులు అరెస్ట్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారు. అవినాష్‌రెడ్డి అరెస్ట్‌ను అడ్డుకునేందుకు కార్యకర్తలు యత్నించగా.. వారిని కూడా పోలీసులు లాగిపడేశారు.మరోవైపు, వారం రోజులుగా రాష్ట్రం నెత్తురోడుతోంది. టీడీపీ గూండాల అరాచకాలతో యథేచ్ఛగా హింసాకాండ సాగుతోంది. పచ్చమూకలు.. జడ్పీటీసీ, ఎంపీటీసిల నామినేషన్లలోనూ దాడులకు దిగుతున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవటమే లక్ష్యంగా పచ్చగూండాలు పేట్రేగిపోతున్నారు. దాడులు చేయడంతో పాటు నామినేషన్ పత్రాల చించివేస్తున్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాలనూ కూడా టీడీపీ నేతలు, ఖాకీలు లెక్క చేయడంలేదు. పచ్చ గూండాలకు సహకరిస్తూ వైఎస్సార్‌సీపీ నేతలను ఖాకీలు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. నామినేషన్లు వేయొద్దంటూ టీడీపీ నేతలు, ఖాకీలు బెదిరింపులకు దిగుతున్నారు. డీజీపీని సుప్రీంకోర్టు ఆదేశించినా ఖాకీల్లో మార్పు కనపడటం లేదు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save