Global Vaartha
Date of Publish : 22/10/2026, 11:06 am
Editor : భవ్య జర్నలిస్ట్

పారా ఆసియా క్రీడల్లో మెరిసిన సువర్ణ.. డిస్కస్ త్రోలో స్వర్ణం..

పారా ఆసియా క్రీడలు 2026లో భారత్ పతకాల జోరు కొనసాగుతోంది. మహిళల డిస్కస్ త్రో ఎఫ్54 ఈవెంట్‌లో భారత్ అథ్లెట్ సువర్ణ రాజ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ పోటీలో ఆమె అత్యుత్తమంగా 15.66 మీటర్ల దూరం విసిరి ఈ క్రీడల్లో తొలి స్వర్ణాన్ని అందుకుంది. మొత్తం ఆరుగురు అథ్లెట్లు తలపడిన ఈ ఫైనల్స్‌లో సువర్ణ రాజ్ అత్యంత స్థిరమైన ప్రతిభ కనబరిచింది.సువర్ణ రాజ్ ఆరు ప్రయత్నాల్లో ఏకంగా నాలుగు సార్లు 15 మీటర్ల మార్క్‌ను దాటింది. ముఖ్యంగా తన ఐదో ప్రయత్నంలో 15.66 మీటర్ల దూరం విసిరి తొలి స్థానంలో నిలిచింది. ఈ విజయంతో భారత పతకాల పట్టికలో ఇది 15వ స్వర్ణం నమోదైంది. ఈ విభాగంలో ఇరాన్ అథ్లెట్ షాహ్లా హదిది (15.45 మీ.) రజతం దక్కించుకోగా, వియత్నాంకు చెందిన న్గుయెన్ థింగోక్ (14.65 మీ.) కాంస్యం సాధించింది.

ఇదే టోర్నీలో ఇతర క్రీడల విషయానికి వస్తే.. పారా షట్లర్ల విభాగంలో మనీషా రాందాస్, ప్రమోద్ భగత్ జోడీ మిక్వెడ్ డబుల్స్ ఎస్ఎన్3-ఎస్‌యూ5 ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించారు. సెమీఫైనల్ పోరులో ఇండోనేషియా జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. అయితే, మరో భారత జోడీ తులసిమతి మురుగేశన్, నితేశ్ కుమార్ ఫైనల్‌లో తలపడనుండటంతో భారత్‌కు మరో స్వర్ణం లభించే అవకాశం ఉంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save