ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లారు. ఎటువంటి భద్రత, కాన్వాయ్ లేకుండా ఒంటరిగానే సీఎం నివాసానికి జనసేనాని వచ్చారు. తన వాహనాన్ని డ్రైవర్ నడుపుతుండగా కారులో చంద్రబాబు నివాసానికి పవన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య కీలక చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. స్థానిక ఎన్నికలు, రెబల్స్ బెడద, సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఇరువురు భేటీ అయినట్లు తెలుస్తోంది. పట్టణ స్థానిక ఎన్నికలు వాయిదాపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.