Global Vaartha
Date of Publish : 22/10/2026, 1:08 pm
Editor : భవ్య జర్నలిస్ట్

అస్వస్థతకు గురైన యనమల రామకృష్ణుడు.. వైద్యులకు ఫోన్ చేసిన సీఎం చంద్రబాబు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్య సమస్యలతో ఒక్కసారిగా అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కాకినాడలోని ఓ ప్రైవేట్‌లో చేర్పించగా.. పరీక్షించిన వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. దీని గురించి సమాచారం అందిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. వైద్యులతో ఫోన్‌లో మాట్లాడారు. యనమల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.మరోవైపు, రాజ్యసభ ఎంపీ సానా సతీశ్ ఆస్పత్రి వద్దకు చేరుకుని వైద్య చికిత్సను పర్యవేక్షిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత యనమల అస్వస్థతకు గురికావడంతో ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యనమల.. హఠాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save