Global Vaartha
Date of Publish : 22/10/2026, 2:06 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఘనంగా అప్సాకుల్లా ఖాన్ జయంతి వేడుకలు.

  • ప్రధమ ముస్లిం స్వాతంత్ర సమరయోధుడు అప్సాకుల్లా ఖాన్ జయంతి.
  • సాయుధ పోరాట విప్లవ వీరుడు అప్సాకుల్లా ఖాన్ జయంతి వేడుకలు.

నంద్యాల జిల్లా, ముస్లిం రచయితల సంఘము ఆధ్వర్యంలో అధ్యక్షులు ఎం.ఎండి.రఫీ అధ్యక్షతన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, విప్లవకారులు అప్సాకుల్లా ఖాన్ జయంతి వేడుకలు భగత్ సింగ్ గ్రంథాలయములో ఘనంగా నిర్వహించారు. ముస్లిం రచయితల సంఘము అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి,సభ్యులు అప్సకుల్లా ఖాన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఎం.ఎండి.రఫీ మాట్లాడుతూ అప్సకుల్లా ఖాన్ బహుభాషా కోవిదుడని, హిందీ, ఉర్దూ, పారసీ భాషలలో దేశభక్తి కవితలు రాసేవారని, మహాత్మా గాంధీని స్ఫూర్తి గా తీసుకొని స్వాతంత్ర ఉద్యమంలో అనేక పోరాటాలు చేశారు అప్షకుల్లా ఖాన్. ఈయన ప్రాణ మిత్రుడు రాంప్రసాద్ బిస్మల్, హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ లో ఉద్యోగం చేసేవారు. రాంప్రసాద్ బిస్మల్, అప్సకుల్లా ఖాన్ ఇద్దరి స్నేహము హిందూ - ముస్లిం ఐక్యతకు ఒక గొప్ప ప్రతీక అని కొనియాడారు. ఈయన జైలు జీవితంలో ఇస్లాం పవిత్ర గ్రంథం ఖురాన్ చదివేవారు. ఈయనను రాజేద్రోహం నేరంపై బ్రిటీష్ వారు అరెస్టు చేసి ఉరి తీశారు. నా దేశ స్వాతంత్రం కోసం సదా నీకు సేవ చేస్తూనే ఉంటాను అని చెప్పినటువంటి యువ పోరాట విప్లవ వీరుడుగా అభివర్ణించారు. బిస్మల్, అప్స కుల్లా ఖాన్ ఇరువురి సమిష్టి లక్ష్యం ఒకటే అని, ఒకే రోజు బ్రిటిష్ వారు వేరు వేరు ప్రదేశాలలో ఉరి తీయబడ్డారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సమద్ ప్రసంగిస్తూ భగత్ సింగ్ కంటే ముందుగానే ఉరి తీయబడిన ముస్లిం స్వాతంత్ర సమరయోధుడు అప్స కుల్లా ఖాన్. 1925 కాకోరి రైలు దోపిడీ లో కీలక పాత్ర వహించిన స్వాతంత్ర సమరయోధుడు. ప్రధాన కార్యదర్శి మహబూబ్ బాషా అప్సకుల్లా ఖాన్ జీవిత చరిత్ర కవితను వినిపించారు. నేటి యువతకు ఈయన జీవిత పోరాటాలు, దేశభక్తి ఆదర్శం అన్నారు. వారి కుటుంబం ఉన్నత స్థాయి కుటుంబమని తెలియజేశారు.కవి, ఉపాధ్యాయులు ఎల్. ఎన్ నీలకంఠమాచారి అప్సకుల్లా ఖాన్ గారి జైలు జీవితం పై కవితను వినిపించారు. ఊర కంబాన్ని ముద్దాడడం ఆయన త్యాగానికి చిహ్నం.ఉర్దూ ప్రధాన ఉపాధ్యాయులు అబ్దుల్ అజీజ్ అప్సకుల్లా ఖాన్ గారి జీవితము దేశభక్తి, పోరాటాలను, గాంధీజీ స్ఫూర్తిని వివరించారు.

 సహాయ నిరాకరణ ఉద్యమము ద్వారా వచ్చే దేశభక్తిని వివరించారు. అప్సపుల్లా ఖాన్ ఫైజాబాద్ జైల్లో ఉరితీయడం జరిగిందన్నారు. భగత్ సింగ్ ఇంచార్జ్ గ్రంథాలయాధికారి శివప్రసాద్ అప్సకుల్లా ఖాన్ ధైర్యము, త్యాగము, దేశభక్తి భారతీయులు ఇలాంటి స్వాతంత్ర సమరయోధుల జీవిత విశేషాలు తెలుసుకోవడం చాలా సంతోషం అన్నారు. షరీఫ్ మాట్లాడుతూ అప్సకుల్లా ఖాన్ భారతదేశంలో జన్మించిన ప్రతి వ్యక్తి భారతీయుడని, ఆ తర్వాతనే తన తన మతంలో పెరిగి పెద్దవాడవుతాడని తెలిపారు. ఈయన పాల్గొన్న ఉద్యమాల గురించి చక్కగా వివరించారు. అబ్దుల్ వహాబ్, అంజాద్ షరీఫ్, వెంకటసుబ్బయ్య, కమలాకర్, శ్రీ భరత్, పాఠకులు, సాహితీవేత్తలు, కళాకారులు. పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save