Global Vaartha
Date of Publish : 22/10/2026, 2:09 pm
Editor : భవ్య జర్నలిస్ట్

కడపలో ప్రజాస్వామ్యం ఖూనీ...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అడ్డుకుంటున్నారని, వారిపై దాడులు చేసి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి అట్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

మనం అసలు భారతదేశంలో ఉన్నామా...లేక పాకిస్తాన్‌లో ఉన్నామా.... రాష్ట్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నడవడం లేదు లోకేష్ రచించిన రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పోలీసు వ్యవస్థను ఉపయోగించుకోవడం సరికాదు. జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారు. తగిన సమయంలో ప్రజలే సమాధానం చెబుతారు అని అన్నారు.

కడపలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఉన్న పార్టీ ముఖ్య నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి, వైఎస్సార్ జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని అట్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అరెస్టు చేసిన వారిలో పి. రవీంద్రనాథ్ రెడ్డి — వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు,ఎస్.బి. అంజాద్ బాషా — మాజీ డిప్యూటీ సీఎం, కె. సురేష్ బాబు — రాష్ట్ర CEC సభ్యుడు,రామచంద్రారెడ్డి — ఎమ్మెల్సీ, పాకా సురేష్ — మాజీ మేయర్, బి. నరేన్ రెడ్డి — కమలాపురం ఇన్‌చార్జ్, పులి సునీల్ కుమార్ — రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఇతర వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save