దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా సైన్యానికి అధునాతన, తేలికైన(ఎల్‌ఎల్‌ఎల్‌ఆర్-ఐ) గగన తల రాడార్లను సమకూర్చేందుకు భారత్ ఎలకా్ట్రనిక్స్ లిమిటెడ్(బెల్)తో రూ.770తో ఒప్పందం చేసుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. స్వదేశీ గగన తల రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడంలో ఇది కీలక ముందడుగు అని పేర్కొంది. ఈ రాడార్ వ్యవస్థ గగన తలంలో యుద్ధవిమానాల వంటి లక్ష్యాలను గుర్తించడంతోపాటు చిన్న చిన్న డ్రోన్లను సైతం గుర్తించగలదని రక్షణ శాఖ వెల్లడించింది. అంతేగాక పలు గగన తల లక్ష్యాల్లో దేనిపై ముందుగా దృష్టి సారించాలో నిర్ణయించే అదనపు సామర్థ్యం దీనికి ఉందని రక్షణ శాఖ వివరించింది. ఈ కారణంగా సైన్యానికి వాటిని గుర్తించి నిర్వీర్యం చేయడం సులభతరమవుతుందని తెలియజేసింది.