Date of Publish : 22/10/2026, 2:28 pm
Editor : భవ్య జర్నలిస్ట్
నువ్వు నోటికి పని చెబితే మేము చేతికి పని చెబుతాం...
- మాజీ ఎమ్మెల్యే రాచమల్లు వ్యాఖ్యలపై టిడీపీ నాయకులు నంద్యాల కొండారెడ్డి ఆగ్రహం...
- రాచమల్లు గత రెండు రోజులుగా నోటికి అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారు
ఎన్నికలను ఫేస్ చేయ దానికి భయపడి నామినేషన్ ప్రక్రియకు దూరంగా ఉన్న రాచమల్లు
గత ఎన్నికల్లో మీరు అవలంబించిన తీరు ప్రజలందరికీ తెలుసు
టిడిపికి 23 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయని హేళన చేస్తే దేవుడు మీకు 11 సీట్లు ఇచ్చారు .
లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజల సహకారం లేదని ఆక్రోశం , బాధ వల్ల అహంకారమైన భాషతో రాచమల్లు మాట్లాడుతున్నాడు
నేను అదే భాష మాట్లాడుతా , నువ్వు నన్ను ఏమీ చేయలేవు కానీ మాకు సంస్కారం ఉంది
కానీ ఇదే పద్ధతులు అవలంబిస్తే నీవు మాట్లాడకుండా మేము ఏం చేయాలో అది చేస్తాం.
ప్రొద్దుటూరులో ప్రశాంతత ఉండాలని మేము కోరుకుంటున్నాం
గత ఎన్నికల్లో రాచమల్లు పోలీసులను అడ్డుపెట్టుకొని అభ్యర్థుల ఇంటి వద్దకు పంపి నామినేషన్లు వేయకుండా చేసింది మర్చిపోయాడేమో...
నేను అధికారంలోకి వస్తే గెలిచిన వాళ్లను సమాధులు చేస్తామని చెబుతున్నావు మేము చేయడానికి మాకు అధికారం అవసరం లేదు ఆ ఆత్మగౌరవం , దమ్ము మాకు ఉంది.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.