‘వేలూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) ఈఈఈ’ 2027 పరీక్ష కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంజనీర్లు కావాలని ఆశించే విద్యార్థులు తమ కలల వృత్తి వైపు అడుగు వేసేందుకు ఇది ఒక మంచి అవకాశమని వీఐటీ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు వేలూరు, చెన్నై, అమరావతి (ఆంధ్రప్రదేశ్) క్యాంప్‌సలలో అందించే ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం జ్ట్టిఞట://ఠిజ్ట్ఛ్ఛ్ఛీ.ఠిజ్టీ.్చఛి.జీుఽ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వీఐటీ ఈఈఈ 2027 పరీక్ష ఒకే దశలో వచ్చే ఏడాది ఏప్రిల్ 28 నుంచి మే 2వ తేదీ వరకు నిర్వహించబడుతుంది. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా 133 నగరాల్లో, అంతర్జాతీయంగా 9 కేంద్రాల్లో జరుగుతుంది. దీని వల్ల భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన విద్యార్థులు కూడా ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అవకాశం కలుగుతుందని నిర్వాహకులు వెల్లడించారు.