Global Vaartha
Date of Publish : 22/10/2026, 2:41 pm
Editor : భవ్య జర్నలిస్ట్

దసరా వ్యాఖ్యలపై రణ్‌బీర్ కపూర్ వివరణ.. తప్పును ఒప్పుకున్న నటుడు..

దసరా ప్రసంగంలో మాట తడబడటంపై బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ క్షమాపణలు చెప్పాడు. తాను చెప్పాలనుకున్న దానికి బదులుగా మరో అర్థం వచ్చేలా రణ్‌బీర్ మాట్లాడాడు. దీంతో తన తాజా చిత్రం 'రామాయణం' ప్రచార కార్యక్రమంలో భాగంగా చెన్నైలో జరిగిన సంగీత వేడుకలో ఈ ఘటనపై స్పందించారు. తన తప్పును అంగీకరిస్తూ, గతంలో తాను నటించిన 'రాక్‌స్టార్' సినిమాలోని పాట పంక్తులను ప్రస్తావించారు (Ranbir Kapoor Apology).అక్టోబర్ 20న పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జరిగిన దసరా వేడుకకు 'రామాయణం' చిత్ర బృందం హాజరైంది. ఈ సందర్భంగా రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ.. చెడు ఎంత శక్తివంతమైనదైనా చివరకు సత్యం, మంచితనమే గెలుస్తాయని చెప్పాలనుకున్నారు. అయితే, ఆయన మాటల్లో పొరపాటు చోటుచేసుకుంది. చివరికి సత్యం, మంచితనమే అంతమవుతాయని అర్థం వచ్చేలా మాట్లాడారు. దీంతో ఈ ప్రసంగానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పలువురు ఆయనపై విమర్శలు చేయగా, మరికొందరు ఈ ఘటనపై సరదాగా స్పందించారు (Ranbir Dussehra Speech).

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save