కడప - తాడిపత్రి జాతీయ రహదారిపై వల్లూరు మండల పరిధిలోని ఏ. ఒబాయపల్లి బస్టాండ్ సమీపంలో గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది..
కడప నుంచి కమలాపురం వైపు వెళ్తున్న చిన్న ఆటోను, దాని వెనుక నుంచి వస్తున్న మహారాష్ట్రకు చెందిన పెద్ద లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరికి గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు..
అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వల్లూరు పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు..