న్యూజిలాండ్, భారత్ మధ్య ఇవాళ్టి నుంచి టీ20 సిరీస్ ప్రారంభమైంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరుగుతోంది. నాలుగేళ్ల విరామం తర్వాత టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేశాడు. ఈ క్రమంలోనే భువీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. పవర్‌ప్లేలో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ మాజీ పేసర్ టిమ్ సౌథీ రికార్డును భువీ బ్రేక్ చేశాడు.క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కివీస్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. తొలి ఓవర్ వేసిన భువనేశ్వర్ కేవలం నాలుగు పరుగులే ఇచ్చి మూడు డాట్ బాల్స్ వేశాడు. దీంతో పూర్తి సభ్య దేశాల బౌలర్లలో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల పవర్‌ప్లేలో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 10 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ రెండు వికెట్లు కోల్పోయి..98 పరుగులు చేసింది. మయాంక్ యాదవ్, నితీశ్ రెడ్డి చెరో వికెట్ తీశారు.