Global Vaartha
Date of Publish : 22/10/2026, 3:26 pm
Editor : భవ్య జర్నలిస్ట్

భవానీ భక్తుల మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం

కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద భవానీ దీక్షలో ఉన్న నలుగురు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. భవానీ భక్తుల మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (AP CM Chandrababu Naidu) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భవానీ దీక్షలో ఉన్న నలుగురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంపై సీఎం సంతాపం తెపారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి దర్శనం కోసం కాలినడకన వస్తున్న భవానీ భక్తులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందటం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save