Global Vaartha
Date of Publish : 22/10/2026, 3:46 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఏపీ సీఎస్ సాయిప్రసాద్ పదవీకాలం పొడిగించిన ప్రభుత్వం

 ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ పదవీకాలాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ ఏడాది నవంబర్ 30వ తేదీన ఆయన పదవి విరమణ చేయాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు సాయిప్రసాద్ పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించాలని డీఓపీటీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిపై సాయిప్రసాద్ పదవీకాలాన్ని ఆరు నెలల పాటు డీఓపీటీ పొడిగించింది. దీంతో వచ్చే ఏడాది మే 30వ తేదీ వరకు చీఫ్ సెక్రటరీగా సాయిప్రసాద్ కొనసాగనున్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save