Global Vaartha
Date of Publish : 22/10/2026, 3:48 pm
Editor : భవ్య జర్నలిస్ట్

సముద్రం పేరు మారుస్తానంటే.. పిచాయ్ నో చెప్పారు: ట్రంప్

అట్లాంటిక్ మహాసముద్రం పేరు మార్పునకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అస్సలు అంగీకరించలేదని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తెలిపారు. ‘నేను పేరు మారుద్దామని అన్నాను.. ఆయనేమో వద్ద వద్దు.. ఈసారి నా వల్ల కాదని అన్నారు’ అని ఇటీవల టెన్నిస్సీ రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్ తెలిపారు. ‘సర్.. సముద్రాల వ్యవహారం వేరు. అవి చాలా దేశాలతో ముడిపడి ఉంటాయి. దయచేసి అలా చేయాలని మాత్రం అనొద్దు’ అని పిచాచ్ చెప్పినట్టు వివరించారు. పదవిలోంచి దిగిపోయే లోపు అట్లాంటిక్ మహాసముద్రం పేరును అమెరికా సముద్రంగా మార్చాలని యూఎస్ అధ్యక్షుడు ఉవ్విళ్లూరుతున్న విషయం తెలిసిందే.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save