Global Vaartha
Date of Publish : 22/10/2026, 3:59 pm
Editor : భవ్య జర్నలిస్ట్

మా ప్రభుత్వంలో ముదిరాజ్‌లను భాగస్వాములను చేసే బాధ్యత నాది: సీఎం రేవంత్‌రెడ్డి

తమ ప్రభుత్వంలో ముదిరాజ్‌లను భాగస్వాములను చేసే బాధ్యత తనదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నాడు ఎన్టీఆర్ రూ.2లకు కిలో బియ్యం ఇస్తే.. తాము సన్నబియ్యం ఇస్తున్నామని తెలిపారు. 3.48 కోట్ల మందికి నేడు సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పుకొచ్చారు.ఈరోజు (శుక్రవారం) హైదరాబాద్‌లో పండగ సాయన్న జయంతి సభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. కొడంగల్ నియోజకవర్గంలో అత్యధిక జనాభా ముదిరాజులేనని తెలిపారు.ముదిరాజులు విశ్వసనీయమైన వారని కొనియాడారు. స్వాములు తన భూమిని ఆక్రమించుకొన్నప్పుడు పండుగ సాయన్న ఎదురుతిరిగారని తెలిపారు. జాం హయాంలో దొరలు పేదలభూమి ఆక్రమిస్తుంటే పేదలకు అండగా పండగ సాయన్న నిలిచారని ప్రశంసించారు. రలకు వ్యతిరేకంగా దళాన్ని పండుగ సాయన్న ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. యన్న ప్రజలకు ధాన్యం పంచడమే కాదని పేద ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం చేశారని కీర్తించారు. సాయన్నను నిజాం పోలీసులు అరెస్టు చేస్తే నాటి వనపర్తి మహారాణి పెద్దఎత్తున నిధులు చెల్లించి సాయన్నను విడిపించారని ప్రస్తావించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save