Global Vaartha
Date of Publish : 22/10/2026, 4:33 pm
Editor : భవ్య జర్నలిస్ట్

సౌదీ ఎయిర్‌‌పోర్టుపై దాడి.. మృతుల్లో భారతీయుడు

సౌదీలోని దమ్మామ్ ఎయిర్‌పోర్టుపై బుధవారం హూతీలు జరిపిన దాడిలో ఇద్దరు మరణించినట్టు దేశ పౌర విమానయాన శాఖ తాజాగా పేర్కొంది. మృతుల్లో ఓ భారతీయుడు కూడా ఉన్నట్టు వెల్లడించింది. గాయపడ్డ వారిలో భారతీయులతో పాటు యెమెన్, బంగ్లాదేశీ వ్యక్తులు కూడా ఉన్నారని పేర్కొంది. ఘటనపై మరింత సమాచారం సేకరిస్తున్నట్టు రియాద్‌లోని భారతీయ ఎంబసీ ఎక్స్ వేదికగా తెలిపింది. బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలియజేసింది. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.ఈ దాడిలో ఎయిర్‌పోర్టు ఏ మేరకు దెబ్బతిన్నదో అధికారులు ప్రస్తుతం అంచనా వేస్తున్నాయి. ఎయిర్‌పోర్టు కార్యకలాపాలను ఇప్పటికే పునరుద్ధరించారు. బుధవారం ఓ డ్రోన్ దాడిని విజయవంతంగా అడ్డుకున్నామని సౌదీ ఇంధన శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, డ్రోన్ శకలాలు తగిలి ఇద్దరు మరణించారని, మరో ఇద్దరు గాయపడ్డారని చెప్పింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save