Global Vaartha
Date of Publish : 23/10/2026, 10:33 am
Editor : భవ్య జర్నలిస్ట్

ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఫోన్ హ్యాక్.. వెలుగులోకి రహస్య లావాదేవీలు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు, మాజీ సలహాదారు జారెడ్ కుష్నర్‌కు సంబంధించిన ఫోన్ హ్యాకింగ్ వ్యవహారం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నేతలతో రహస్య ఆర్థిక, దౌత్య వ్యవహారాలు ఈ హ్యాకింగ్ కారణంగా బయటపడ్డాయని 'వానిటీ ఫెయిర్' ప్రచురించిన పరిశోధనాత్మక కథనం పేర్కొంది. ఈ ఆరోపణలను కుష్నర్ తీవ్రంగా ఖండించారు (Jared Kushner hacked phone).వానిటీ ఫెయిర్ కథనం ప్రకారం.. 2017లో రష్యా సైనిక నిఘా విభాగానికి సంబంధించిన సర్వర్‌లోకి డచ్ నిఘా అధికారులు ప్రవేశించినప్పుడు కుష్నర్ ఐఫోన్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్లు గుర్తించారు. రష్యా హ్యాకర్ నుంచి లభించిన సమాచారాన్ని పరిశీలించిన డచ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ సర్వీస్ (ఎంఐవీడీ) ఈ వివరాలను సేకరించింది. కుష్నర్‌కు యూఏఈలోని ఒక బ్యాంకు ఖాతాను నిర్వహించే అధికారం ఉన్నట్లు డచ్ నిఘా అధికారులు గుర్తించారు. ఆ ఖాతాలోకి అజర్‌బైజాన్‌లోని బ్యాంకు ద్వారా వందల కోట్ల డాలర్లు వచ్చినట్లు ఆ కథనం పేర్కొంది (Donald Trump son-in-law).

అమెరికా విదేశాంగ విధానానికి సంబంధించిన లక్ష్యాల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలనే ఆలోచన 2018లో చర్చకు వచ్చినట్లు కథనం పేర్కొంది. సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, యూఏఈ నాయకత్వానికి సంబంధించిన వ్యక్తులు ఈ ప్రతిపాదనలో భాగమైనట్లు పేర్కొంది. 10 బిలియన్ డాలర్లకు పైగా నిధుల సమీకరణ గురించి చర్చ జరిగినప్పటికీ, ఆ తర్వాత ప్రతిపాదనను పక్కన పెట్టినట్లు కథనం తెలిపింది. అనంతరం కుష్నర్‌కు చెందిన రెండు ఖాతాల్లోకి మొత్తం 2 బిలియన్ డాలర్లకు పైగా జమ అయినట్లు ఆరోపించింది (Jared Kushner secret dealings).

ఈ కథనంపై జారెడ్ కుష్నర్ తరఫు న్యాయవాది తీవ్రంగా స్పందించారు. ప్రచురించిన ఆరోపణలను ఆధారాలు లేని కల్పిత కథనాలుగా అభివర్ణించారు. విదేశీ నేతలతో చేసినట్లు ఆరోపిస్తున్న ఒప్పందాలు, ఏర్పాట్లు అమెరికా అధ్యక్షుడి అనుమతి లేకుండా జరగలేదని కుష్నర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. కథనాన్ని ప్రచురించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save