Global Vaartha
Date of Publish : 23/10/2026, 10:36 am
Editor : భవ్య జర్నలిస్ట్

వన్డేల్లో జో రూట్ అరుదైన రికార్డు.. ఇంగ్లాండ్ తరఫున తొలి బ్యాటర్ గా.

పాకిస్థాన్ వేదికగా ముక్కోణపు సిరీస్ జరుగుతోంది. ఈ ట్రై సిరీస్‌లో భాగంగా గురువారం ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య మ్యాచ్ జరిగింది. ఈ హై స్కోరింగ్ మ్యాచ్‌లో ప‌లు రికార్డులు బ‌ద్ద‌లయ్యాయి. వ‌న్డే చ‌రిత్ర‌లోనే రెండో అత్యధిక ప‌రుగుల టార్గెట్‌ను ఛేదించిన జ‌ట్టుగా శ్రీలంక రికార్డు సృష్టించింది. ఇంగ్లాండ్ విధించిన 430 ప‌రుగుల ల‌క్ష్యాన్ని లంక‌ 49.5 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి అందుకుంది.ఇదే మ్యాచ్‌లో ఇంగ్లాండ్ సీనియ‌ర్ బ్యాట‌ర్ జో రూట్ ఒక అరుదైన రికార్డు సాధించాడు. 66 బంతుల్లో 69 ప‌రుగులు చేసిన రూట్ వ‌న్డే క్రికెట్‌లో ఇంగ్లాండ్ త‌ర‌ఫున 8వేల పరుగుల మార్క్ దాటిన తొలి బ్యాట‌ర్‌గా అరుదైన ఘనతను సాధించాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు ఉన్నాయి. ఇక వ‌న్డే క్రికెట్‌లో ఇంగ్లాండ్ త‌ర‌ఫున రూట్ (8,005 ప‌రుగులు) త‌ర్వాత ఇయాన్ మోర్గాన్ (6,957 ప‌రుగులు), జోస్ బ‌ట్ల‌ర్ (5,678 ప‌రుగులు), ఇయాన్ బెల్ (5,416 ప‌రుగులు), పాల్ కొలింగ్‌వుడ్ (5,092 ప‌రుగులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

అయితే వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన క్రికెట‌ర్ల జాబితాలో రూట్ చాలా దూరంలో ఉన్నాడు. అగ్రస్థానంలో క్రికెట్ దిగ్గజం స‌చిన్ టెండూల్కర్ (18,426 ప‌రుగులు)ఉండగా.. రెండో స్థానంలో విరాట్ కోహ్లి (15,109 ప‌రుగులు) కొనసాగుతున్నాడు. శ్రీలంక మాజీ క్రికెటర్ సంగక్క‌ర (14,234 ప‌రుగులు), ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (13, 704 ప‌రుగులు), స‌న‌త్ జ‌యసూర్య (13,140 ప‌రుగులు) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొన‌సాగుతున్నారు. వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన వారిలో కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌, జో రూట్‌లు మాత్ర‌మే ప్రస్తుతం యాక్టీవ్‌గా ఉన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save