వైసీపీ నేత జోగి రమేశ్ కోడలు జోగి మేఘన ప్రయాణించే కారుకు ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేఘన ప్రయాణిస్తున్న కారును బస్సు ఢీకొనడంపై అనుమానం వ్యక్తం చేస్తూ మేఘన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జోగి మేఘన, ఆమె తండ్రి కృష్ణ ఈనెల 15న విజయవాడ నుంచి కోదాడకు కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారును వెనక నుంచి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగంగా ధ్వంసమైంది.అయితే కారు ప్రమాదానికి మాజీ మంత్రి జోగి రమేష్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ ఈనెల 16న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో మేఘన తండ్రి కృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో మాజీ మంత్రి జోగి రమేశ్ హస్తం ఉండి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తమకు ప్రాణహాని ఉందని, ఈ ప్రమాదంపై విచారణ చేయాలని పోలీసులను మేఘన తండ్రి కృష్ణ కోరారు. ఈ ప్రమాదంపై ఇబ్రహింపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.