Global Vaartha
Date of Publish : 23/10/2026, 11:23 am
Editor : భవ్య జర్నలిస్ట్

పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు..

పరవాడ ఫార్మాసిటీలోని అరబిందో ఫార్మా పరిశ్రమలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. యూనిట్‌-15 ప్రొడక్షన్ బ్లాక్‌లో ఉదయం 5:30 గంటలకు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, అతికష్టం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో యాజమాన్యం, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ అగ్నిప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేదా రసాయన చర్య కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కాగా, ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు ప్రమాదానికి గల అసలు కారణాలపై దర్యాప్తు చేపట్టారు

కలెక్టర్, ఎస్పీకి హోం మంత్రి ఫోన్..

అరబిందో పరిశ్రమలో అగ్నిప్రమాదంపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఘటనపై అనకాపల్లి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలు, ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పరిశ్రమలో సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save