Global Vaartha
Date of Publish : 23/10/2026, 11:26 am
Editor : భవ్య జర్నలిస్ట్

మరో 20 ఏళ్లే బతుకుతారన్న అభిమాని.. ఆనంద్ మహీంద్రా అదిరిపోయే కౌంటర్..

 ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఫన్నీగా స్పందిస్తుంటారు. తాజాగా ఓ అభిమాని ఆయన జీవితకాలం గురించి చేసిన వ్యాఖ్యకు ఆనంద్ మహీంద్రా ఇచ్చిన ఫన్నీ కౌంటర్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. మరో 20 ఏళ్లలో మీరు చనిపోవచ్చని వ్యాఖ్యానించిన అభిమానిని.. తన జీవితానికి వారంటీ పొడిగించాలని ఆనంద్ కోరారు (Anand Mahindra viral reply).ప్రణేశ్ నాయుడు అనే ఎక్స్ వినియోగదారుడు ఆనంద్ మహీంద్రాకు తాను చిన్నప్పటి నుంచి అభిమానినని పేర్కొన్నాడు. మహీంద్రా స్కార్పియో వాహనంలో శక్తిమంతమైన వీ8 లేదా వీ10 ఇంజిన్‌ను తీసుకురావాలని కోరాడు.స్కార్పియోలో 500 హార్స్‌పవర్ శక్తిని ఉత్పత్తి చేసే వీ8 ఇంజిన్‌ను అమర్చితే వాహనం అద్భుతంగా ఉంటుందని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ సూచన చేస్తూనే.. ఆనంద్ మహీంద్రా మరో 20 ఏళ్లలో మరణించే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానించాడు. చనిపోయే లోపు శక్తిమంతమైన ఇంజిన్‌ను తయారు చేయాలని కోరాడు.అభిమాని వ్యాఖ్యకు ఆనంద్ మహీంద్రా హాస్యభరితంగా స్పందించారు (Anand Mahindra X post). ' మీరు నా అభిమాని అయినందకు సంతోషం. నా జీవితానికి మరో 20 ఏళ్లే గడువు విధిస్తూ నమ్మకంగా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. 20 ఏళ్ల జీవితం కూడా గౌరవప్రదమైన ప్రయాణమే అయినప్పటికీ, నేను ఈ భూమిపై అంతకంటే మరికొంత ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నా. వీ8 ఇంజిన్ల గురించి చర్చించే ముందు నా జీవితానికి వారంటీ పొడిగించగలరా?' అంటూ చమత్కరించారు. ఈ సమాధానం సోషల్ మీడియాలో పలువురిని ఆకట్టుకుంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save