స్థానిక సంస్థల ఎన్నికల విధుల నుంచి పులివెందుల డీఎస్పీ మురళీనాయక్‌ను పక్కన పెట్టాలని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆలపాటి గిరిధర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.