Global Vaartha
Date of Publish : 23/10/2026, 12:02 pm
Editor : భవ్య జర్నలిస్ట్

టీమిండియాకు భారీ షాక్.. గాయంతో రెండో టీ20కి ఇషాన్ కిషన్ దూరం!

 న్యూజిలాండ్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన తొలి టీ20లో విజయం సాధించిన టీమిండియాకు భారీ షాక్ తగిలింది. భారత స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గాయంతో రెండో టీ20కి దూరమైనట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అతను కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో బోర్డు స్పష్టం చేయలేదు. అలానే అతడు తిరిగి జట్టులోకి ఎప్పుడు వస్తాడనే విషయంపై కూడా స్పష్టత రాలేదు. నిన్న(గురువారం) జరిగిన తొలి టీ20లో ఇషాన్ కిషన్ తొడ కండరాల నొప్పితో ఇబ్బంది పడ్డాడు.తొలి టీ20 మ్యాచ్‌లో తిలక్ వర్మ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రాగా.. అతడి స్థానంలో ఇషాన్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే క్రీజులోకి వచ్చినప్పటి నుంచి ఇబ్బందిగా కనిపించిన ఇషాన్ మూడు బంతులాడి ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్చ చేరాడు. ఇషాన్ గాయం పెద్దది కానప్పటికీ, రెండో టీ20కి బీసీసీఐ అతడికి విశ్రాంతినిచ్చింది.

ఇషాన్ కిషన్ గాయం విషయంపై బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ పలు విషయాలను ప్రస్తావించాడు. ‘ఇషాన్ కిషన్ కండరాల నొప్పితో బాధపడుతున్నాడు. గాయం తీవ్రత పెద్దది కానప్పటికీ.. రెండో టీ20లో అతడు ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ రెండో టీ20లో ఇషాన్ ఆడకపోతే, వైభవ్ సూర్యవంశీ ఆడే అవకాశం ఉంది. ఇక తొలి టీ20లో ఇషాన్ గాయంతో ఇబ్బంది పడడంతోనే బ్యాటింగ్‌ ఆర్డర్‌లో తిలక్ వర్మకు ప్రమోషన్ లభించింది. రెండో టీ20లో తిలక్ తన స్థానంలోనే బ్యాటింగ్‌కు వస్తాడు’ అని వెల్లడించాడు.

ప్రస్తుతం ఇషాన్‌ కిషన్‌ సూపర్‌ ఫామ్‌ కనబరుస్తున్నాడు. టీ20 క్రికెట్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వస్తున్న ఇషాన్‌ భారీ ఇన్నింగ్స్‌లతో అలరిస్తున్నాడు. రీఎంట్రీ తర్వాత ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో వెయ్యి పరుగుల మార్క్‌ను పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్‌గా 67 టీ20ల్లో 1,955 పరుగులు సాధించిన ఇషాన్.. ఒక సెంచరీ, 13 అర్థసెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save