Global Vaartha
Date of Publish : 23/10/2026, 12:16 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్

శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం బయలుదేరిన కాసేపటికి సాంకేతిలోపం తలెత్తింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈరోజు(శుక్రవారం) ఉదయం ఏఐ 417 విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ముంబై వెళ్లేందుకు బయలుదేరింది. విమానంలో మొత్తం 109 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే అందులో సాంకేతికలోపాన్ని పైలట్ గుర్తించారు.వెంటనే ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. ఆ తరువాత పైలట్.. విమానాన్ని తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులతో పాటు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save