Global Vaartha
Date of Publish : 23/10/2026, 1:00 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఏఐ సాయం చేసింది.. మనిషే తుది నిర్ణయం తీసుకున్నాడు.. ఇరాన్ పాఠశాల దాడిపై మాజీ సీఐఏ చీఫ్

 ఇరాన్‌లోని మినాబ్ నగరంలో బాలికల పాఠశాలపై జరిగిన ప్రాణాంతక దాడిపై అమెరికా సీఐఏ మాజీ డైరెక్టర్, జనరల్ డేవిడ్ పెట్రాయస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దాడిలో లక్ష్యాన్ని గుర్తించేందుకు ఏఐ సాయం చేసినప్పటికీ, తుది దాడి నిర్ణయం మాత్రం మనిషే తీసుకున్నాడని ఆయన తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న ఎన్‌డీటీవీ ప్రపంచ సదస్సులో మాట్లాడిన ఆయన వ్యాఖ్యలు, యుద్ధాల్లో ఏఐ పాత్రపై మరోసారి చర్చకు దారితీశాయి (Iran school bombing).

మినాబ్‌లోని షజరే తయ్యెబె బాలికల ప్రాథమిక పాఠశాలపై జరిగిన దాడి గురించి పెట్రాయస్‌ను ప్రశ్నించగా.. లక్ష్యాన్ని గుర్తించడంలో ఏఐ ఉపయోగపడిందని, అయితే తుది నిర్ణయం మనిషే తీసుకున్నాడని చెప్పారు. యుద్ధాల్లో ఏఐ విస్తృతంగా ఉపయోగిస్తున్నప్పటికీ, తప్పులు జరిగే అవకాశం ఉందని ఆయన అంగీకరించారు. మధ్యప్రాచ్యంతో పాటు ఉక్రెయిన్‌లోనూ ఇలాంటి పొరపాట్లు జరిగి ఉండవచ్చని పేర్కొన్నారు. కీలక నిర్ణయాలు తీసుకునే అధికారులు విమర్శకుల అభిప్రాయాలను, సందేహాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు (Minab school strike).

మినాబ్‌లోని పాఠశాల సముదాయంపై జరిగిన దాడిలో కనీసం 156 మంది ప్రాణాలు కోల్పోయారు (AI warfare). వీరిలో అధిక సంఖ్యలో చిన్నారులు ఉన్నారు. అయితే, ఈ దాడిలో ఏఐ పాత్రపై రకరకాల వార్తలు వచ్చాయి. ఆ పాఠశాల ఉన్న స్థలంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ నౌకాదళ విభాగం ఉండేది. ఆ స్థావరం గురించి ఏఐ తప్పుడు సమాచారం ఇవ్వడంతోనే దాడి జరిగినట్టు చాలా విశ్లేషణలు వచ్చాయి. ఏదేమైనా, యంత్రాలు నిర్ణయ ప్రక్రియను వేగవంతం చేయగలిగినా, వాటి సూచనలను స్వతంత్రంగా పరిశీలించడం, లక్ష్యాన్ని సరిగ్గా నిర్ధారించడం, పౌరుల భద్రతను కాపాడడం అత్యంత కీలకమని పెట్రాయస్ పేర్కొన్నారు...

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save