Global Vaartha
Date of Publish : 23/10/2026, 1:50 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఎల్‌నినో ప్రభావంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి: సీఎస్ సంజయ్ జాజు

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామాలు, పట్టణాల్లో ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. సమాచార, పౌరసంబంధాల శాఖ, తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఈరోజు రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎస్ సంజయ్ జాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.రాష్ట్రంలో 20 శాతానికి పైగా వర్షపాతం తగ్గిందని సీఎస్ తెలిపారు. వర్షపాతం తగ్గడంతో సుమారు 20 శాతం పంట విస్తీర్ణం తగ్గిందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర రిజర్వాయర్లలో 30-40 శాతం మాత్రమే నీటి నిల్వలు తగ్గాయన్నారు. నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని సూచించారు. ఎండల సమయంలో తగినంత నీరు తాగాలని, మధ్యాహ్నం బయటకు వెళ్లడం తగ్గించాలన్నారు. వృద్ధులు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వెల్లడించారు. నీటి కొరత నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఎల్‌నినో ప్రభావంపై ప్రజలకు నిరంతరం సూచనలు, హెచ్చరికలు అందించాలని సీఎస్ సంజయ్ జాజు పేర్కొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save