క్యూవీఎస్ఈ (క్వాంటమ్ వెస్ట్ స్టాక్ ఎక్సేంజ్) యాప్ ద్వారా ఆన్‌లైన్ పెట్టుబడి మోసాలు జరుగుతున్నట్లు కేంద్ర, రాష్ట్ర సైబర్ క్రైం విభాగాలు హెచ్చరిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. సైబర్ నేరగాళ్లు యాప్‌లో ఏపీకే ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవాలని మొబైల్‌ఫోన్ యూజర్లను ఏమార్చుతున్నారని తెలిపారు.భారతదేశ డబ్బును ఫైనాన్స్ ఎక్చ్సేంజ్ ద్వారా క్రిప్టో కరెన్సీగా మార్చి పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారని, అలా చేస్తే 1 శాతం లాభం వస్తుందని నమ్మిస్తున్నారని తెలిపారు. ఈ తరహా మోసాలకు సంబంధించి తెలంగాణలో ఇప్పటికే 52 కేసులు నమోదయ్యాయన్నారు. అత్యాశకు పోయి కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకోవద్దన్నారు. సైబర్ నేరానికి గురైతే తక్షణమే 1930 హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఫోన్ చేయాలన్నారు.