Global Vaartha
Date of Publish : 23/10/2026, 2:01 pm
Editor : భవ్య జర్నలిస్ట్

పది రోజుల్లోనే రూ.33 వేల పతనం.. ఇప్పుడు వెండి కొనొచ్చా..

దేశీయ మార్కెట్లో వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయి. గత పది రోజుల వ్యవధిలోనే కిలో వెండి ధర దాదాపు రూ.33 వేల మేర తగ్గింది. దేశీయంగా కిలో వెండి ధర రూ.2 లక్షల దిగువకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి, ముడి చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ భయాలు వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. మరి, వెండి కోనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయమా? ధరలు మరింత తగ్గే ప్రమాదం ఉందా? అన్న ప్రశ్నలు మదుపరుల్లో వ్యక్తమవుతున్నాయి (Silver price crash).వెండి ధరలు ఇటీవల గణనీయంగా తగ్గాయి. అక్టోబర్ 22న డిసెంబర్ డెలివరీ వెండి ఒప్పందం కిలోకు రూ.1,99,917 వద్ద ముగిసింది. అదే సమయంలో స్పాట్ ధరలు కూడా రూ.2 లక్షల స్థాయికి దిగువన నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరిలో నమోదైన గరిష్ఠ స్థాయితో పోలిస్తే వెండి ధరలు దాదాపు సగానికి పడిపోయాయి. ప్రపంచ మార్కెట్లలో విలువైన లోహాల ధరలు బలహీనపడటంతో భారత మార్కెట్లోనూ వెండి ధరలు తగ్గుతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం ద్రవ్యోల్బణంపై ఆందోళనలను పెంచుతోంది. వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారం, వెండి వంటి లోహాలపై ఇది ప్రతికూల ప్రభావం చూపవచ్చు (Silver price today).

వెండి ధరలు ఇప్పటికే భారీగా తగ్గడంతో చాలా మంది కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వెంటనే కొనుగోలు చేయడం లాభదాయకమని చెప్పలేమని, ధరలు మరింత తగ్గే అవకాశం కూడా ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వెండి ధర రూ.2 లక్షల స్థాయి వద్ద నిలదొక్కుకుంటుందా, లేదా మరింత పడుతుందా అనేది కీలకం కానుంది. రూ.2 లక్షల స్థాయిని నిలబెట్టుకోలేకపోతే నష్టాలు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ధరలు తిరిగి రూ.2.07–2.08 లక్షల స్థాయిని అధిగమిస్తే కొంత స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు (Silver investment India).దీర్ఘకాలిక పెట్టుబడిదారులు మొత్తం డబ్బును ఒకేసారి పెట్టకుండా విడతలవారీగా కొనుగోలు చేసే విధానాన్ని పరిశీలించవచ్చని సూచిస్తున్నారు (Silver market outlook). ఇప్పటికే వెండి కొన్నవారు భయంతో వెంటనే అమ్మేయడం లేదా నష్టాన్ని తగ్గించుకోవడానికి మరింత కొనడం చేయకూడదని, తమ పెట్టుబడి లక్ష్యాన్ని సమీక్షించుకుని జాగ్రత్తగా అడుగులు వేయాలని సూచిస్తున్నారు. అంతర్జాతీయ డిమాండ్, చమురు ధరలు, డాలర్ విలువ, అమెరికా వడ్డీ రేట్లపై అంచనాలను గమనించి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save