Global Vaartha
Date of Publish : 23/10/2026, 3:15 pm
Editor : భవ్య జర్నలిస్ట్

వీసా వస్తుందో రాదోనని ఆందోళన.. అత్తాపూర్‌లో యువకుడి మృతి

 రంగారెడ్డి నగరంలోని అత్తాపూర్‌లో యువకుడి ఆత్మహత్య కలకలం రేపుతోంది. తేజస్వినగర్‌లో 26 ఏళ్ల రోహిత్ రెడ్డి ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉన్నతచదవుల కోసం అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్న రోహిత్ రెడ్డి.. ఇందుకోసం వీసా కోసం ప్రయత్నించాడు. అయితే గతంలో ఒకసారి వీసాకు దరఖాస్తు చేసుకోగా రిజెక్ట్ అయ్యింది. దీంతో రెండోసారి వీసా కోసం సదరు యువకుడు ఎదురుచూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది. వీసా వస్తుందో రాదోనని తల్లిదండ్రులతో కూడా పలుమార్లు చర్చించినట్లు సమాచారం.ఈ క్రమంలో యువకుడి ఆత్మహత్యకు వీసా ఆందోళనే కారణమై ఉండవచ్చని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే అత్తాపూర్ పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save