Global Vaartha
Date of Publish : 23/10/2026, 3:53 pm
Editor : భవ్య జర్నలిస్ట్

కడప ఈటీవీ రిపోర్టర్ సుందర్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

  • జర్నలిస్టులపై దాడులు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్దం
  • ఈటీవీ రిపోర్టర్ సుందర్‌పై దాడి చేసిన గుండాలపై కేసులు నమోదు చేయాలి
  • RSF రాష్ట్ర అధ్యక్షులు డి.యం. ఓబులేసు యాదవ్

కడప జిల్లా జడ్పీ హాల్ వద్ద జరిగే జడ్పీటీసీ నామినేషన్ కేంద్రం దగ్గరలోని మురళి థియేటర్ వద్ద ఎన్నికల శైలిని కవరేజ్ చేస్తున్న ఈటీవీ రిపోర్టర్ సుందర్‌పై అల్లరిమూకలు దాడి చేసి, ఆయన సెల్‌ఫోన్‌ను బలవంతంగా లాక్కోవడం వీడియోస్, ఫొటోస్ డిలీట్ చేయడం దుర్మార్గం అన్ని రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఫోరం (RSF) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని RSF రాష్ట్ర అధ్యక్షులు డి.యం. ఓబులేసు యాదవ్ తెలిపారు

ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియను ప్రజలకు తెలియజేయడంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని, అలాంటి బాధ్యతాయుతమైన విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన అన్నారు. నామినేషన్ కేంద్రం వద్ద జరిగిన ఘటనపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జర్నలిస్టులపై దాడులు చేయడం, వారి సెల్‌ఫోన్లు లాక్కోవడం, వార్తల సేకరణకు అడ్డంకులు సృష్టించడం వంటి చర్యలు పత్రికా స్వేచ్ఛను హరించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నికల సమయంలో అభ్యర్థులు, రాజకీయ నాయకులు, ప్రజలు, మీడియా ప్రతినిధులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వేచ్ఛగా తమ విధులు నిర్వహించుకునేలా పోలీసు యంత్రాంగం తగిన భద్రత కల్పించాలని కోరారు.

జర్నలిస్టులపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పత్రికా స్వేచ్ఛను కాపాడాలని ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో హింసకు, బెదిరింపులకు తావులేకుండా చూడాలి అని RSF రాష్ట్ర అధ్యక్షులు డి.యం. ఓబులేసు యాదవ్ డిమాండ్ చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save