Global Vaartha
Date of Publish : 23/10/2026, 3:55 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. అధికారులకు ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు

 స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అనిల్ చంద్ర పునేఠా మరో కీలక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ముగియనుందని తెలిపారు. కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు తమను నామినేషన్లు దాఖలు చేయకుండా ఎవరైన అడ్డుకున్నారా అనే ఫిర్యాదులను వెంటనే పరిశీలించాలని ఆదేశించారు.ఈ ఫిర్యాదుల విషయంలో అధికారులు వెంటనే ఫిర్యాదుదారులను ఫోన్‌లో సంప్రదించి సాయంత్రం 5 గంటల్లోపు వారితో నామినేషన్ దాఖలు చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ విధానానికి అనుగుణంగా సమర్పించిన నామినేషన్లను స్వీకరించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించాలని అన్నారు. నామినేషన్ల కేంద్రానికి వెళ్లేందుకు అవసరమైన ప్రాంతాల్లో అభ్యర్థులకు వ్యక్తిగత భద్రత కల్పించాలని ఆదేశించారు. నామినేషన్లు వేసేందుకు అవసరమైన ప్రశాంత వాతావరణం కూడా కల్పించాలని ఆదేశించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save