Global Vaartha
Date of Publish : 23/10/2026, 4:19 pm
Editor : భవ్య జర్నలిస్ట్

అమితాబ్ బచ్చన్ బంగ్లాను పేల్చేస్తామంటూ బెదిరింపు ఈ-మెయిల్!

 ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ బంగ్లాను పేల్చేస్తామని హెచ్చరిస్తూ ఓ ఈమెయిల్ వచ్చినట్లు ఇవాళ  ముంబై పోలీసులకు సమాచారం అందింది. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలోని ఒక పాఠశాలకు ఈ బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఈ ఘటనపై ముంబై పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ బెదిరింపు అమితాబ్ బచ్చన్ ముంబైలోని ఏ బంగ్లాను (జల్సా లేదా ప్రతీక్ష) లక్ష్యంగా చేసుకుని వచ్చిందనే కోణంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. (Amitabh Bachchan House Bomb Threat) గతంలో ముంబై మహానగర పాలక సంస్థ కార్యాలయానికి కూడా ఇలాంటి బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు నిర్వహించగా, ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు.

ఈ ఏడాది మార్చి 20వ తేదీన కూడా ముంబై ప్రెస్ క్లబ్‌కు ఇలాంటి బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. భవనం లోపల విషవాయువుతో కూడిన చిన్న చిన్న బాంబులను అమర్చినట్లు ఆ ఈమెయిల్‌లో పేర్కొన్నారు. అయితే అప్పుడు ప్రెస్ క్లబ్‌లో కూడా ఎలాంటి ప్రమాదకర వస్తువులు లభించలేదు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save