Global Vaartha
Date of Publish : 23/10/2026, 4:44 pm
Editor : భవ్య జర్నలిస్ట్

స్వీట్ షాపుల్లో టీజీ సేఫ్ తనిఖీలు.. ఫంగస్ ఉన్న మిఠాయిల గుర్తింపు

హైదరాబాద్ నగరంలోని స్వీట్ షాపులపై టీజీ సేఫ్ ఫుడ్ వింగ్ అధికారులు తనిఖీలు నిర్వమించారు. మొత్తం 12 బృందాలతో ఫుడ్ సేఫ్టీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో అపరిశుభ్ర పరిసరాల్లో స్వీట్లను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. FSSAI లైసెన్స్ లేకుండానే కొన్ని స్వీట్ షాపుల నిర్వహిస్తున్నారని, అంతేకాకుండా గడువు ముగిసిన FSSAI లైసెన్స్‌లతోనూ షాపులను నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది.ఎక్స్‌పైరీ ముగిసిన స్వీట్లను తొలగించకుండా విక్రయానికి పెట్టడంతో పాటు గడువు ముగిసిన స్వీట్లను కొత్త స్వీట్ల తయారీలో కలుపుతున్నట్లు టీజీ సేప్ అధికారులు గుర్తించారు. పురుగులు, ఫంగస్ ఉన్న పల్లీలు, స్వీట్లు విక్రయానికి ఉంచినట్లు తనిఖీల్లో తేలింది. తార్నాకలోని M/s.సుదర్శన్ రెడ్డి ప్యూర్ ఘీ స్వీట్స్‌కు టీజీ సేఫ్ అధికారులు దాడులు నిర్వహించారు. FSSAI లైసెన్స్ లేకుండా స్వీట్ల తయారీ యూనిట్‌ను నిర్వహిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. నిబంధనల ఉల్లంఘనపై సదరు సంస్థకు నోటీసులు జారీ చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save