Global Vaartha
Date of Publish : 23/10/2026, 5:33 pm
Editor : భవ్య జర్నలిస్ట్

రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలు.. శశీ థరూర్ కౌంటర్

 కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ దృష్టి సారించింది కాబట్టే ఆయనను చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. ఓ విఫల వ్యక్తి విజయం కోసం కాంగ్రెస్ పదే పదే ప్రయత్నిస్తోందన్న ప్రధాని కామెంట్స్‌పై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ యువ ఓటర్లలో రాహుల్ గాంధీ నూతన ఉత్తేజాన్ని రాజేశారని శశిథరూర్ వ్యాఖ్యానించారు. బీజేపీ ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు.కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని అన్నారు. పార్టీకి భిన్నమైన అభిప్రాయాలను తానూ అనేక సార్లు వ్యక్తం చేశానని చెప్పారు. కానీ పార్టీలో ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుసరించే విధానాలు, సిద్ధాంతాలు దేశాభివద్ధికి అనుగుణంగా ఉంటాయని ఎంపీ శశీథరూర్ తెలిపారు. అందుకే తాను పార్టీ విధానాలకు మద్దతు ఇస్తున్నానని చెప్పారు. బీజేపీతో ఢీ అంటే ఢీ అనేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని అన్నారు.

అంతకుముందు ప్రధాని మోదీ రాహుల్ గాంధీపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ‘తన విఫల ఉత్పత్తి కోసం యావత్ దేశాన్ని కాంగ్రెస్ ఇంకా ఎంత కాలం పణంగా పెడుతుందో నాకు అర్థం కావట్లేదు. తమ నేతను లాంఛ్ చేసేందుకు కాంగ్రెస్ చేసినన్ని ప్రయత్నాలు శ్రీహరికోటలో (రాకెట్ ప్రయోగ కేంద్రం) కూడా జరిగి ఉండవు’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save