Date of Publish : 23/10/2026, 7:53 pm
Editor : భవ్య జర్నలిస్ట్
చిత్తశుద్ధితో ప్రజా సమస్యల పరిష్కారా నికి కృషి.
- ఎంపీటీసీ ఇండిపెండెంట్ అభ్యర్థి మర్రి రమేష్.
లక్ష్ముడుగూడెం ఎంపీటీసీ పరిధిలో ప్రజా సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తానని ఎంపీటీసీ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మర్రి రమేష్ బాబు స్పష్టం చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల స్వీకరణ కేంద్రంలో శుక్రవారం ఆయన లక్ష్ముడు గూడెం ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ లక్ష్ముడు గూడెం ప్రాదేశిక నియోజకవర్గం పరిధిలోని సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉందని అన్నారు. ముందుగా రహదారుల నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు . గ్రామాల్లో అంతర్గత రహదారులు, పేదలకు నివాసాల నిర్మాణాలు, మౌలిక సదుపాయాల ఏర్పాటు తదితర సమస్యల పరిష్కారానికి నిరంతరం పని చేస్తానని హామీ ఇచ్చారు. తన గెలుపుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈయన వెంట ముంగండ శామ్యూల్ జ్ఞాని, తదితరులు ఉన్నారు.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.