Global Vaartha
Date of Publish : 23/10/2026, 7:58 pm
Editor : భవ్య జర్నలిస్ట్

కడపలో శాంతిని నిలబెట్టాలి

  • ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.. కడపలో శాంతిని నిలబెట్టాలి
  • కడప మేయర్ అభ్యర్థి బండి దీప్తి గారిని భారీ మెజార్టీతో గెలిపించండి

కడప నగర స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇబ్రహీం ఖలీలుల్లా మస్జిద్‌ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కడప మేయర్ అభ్యర్థి బండి దీప్తి గారిని గెలిపించాలని కోరుతూ ప్రచార కరపత్రాలను పంపిణీ చేసిన ఓటు వేయాలని అభ్యర్థించిన వైఎస్సార్‌సీపీ మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ బాషా గారు, మేయర్ అభ్యర్థి బండి దీప్తి గారు.
కడపలో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరిగే ప్రతి చర్యకు ప్రజలు సరైన సమయంలో తమ తీర్పుతో గుణపాఠం చెబుతారు. ప్రజల ఆశీస్సులు, అండదండలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొండంత బలం. రానున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే
కడప నగరంలో టీడీపీకి చెందిన వ్యక్తులు దాడులకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రశాంతతకు, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచిన కడపలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనకరం.

దాడులతో ప్రజలను భయపెట్టవచ్చు.. కానీ ప్రజల గొంతును అణచలేరు! కడప ప్రజలు జరుగుతున్న ప్రతి పరిణామాన్ని గమనిస్తున్నారు. సరైన సమయంలో ప్రజలే తమ తీర్పుతో సమాధానం చెబుతారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save