Global Vaartha
Date of Publish : 23/10/2026, 8:18 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఏపీ హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, నామినేషన్ల ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైఎస్సార్‌సీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు హైకోర్టు అనుమతిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో తమ పార్టీ అభ్యర్థులను పోలీసులు అక్రమంగా అరెస్టులు, గృహనిర్బంధాలు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.అక్రమ నిర్బంధంలో ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులందరినీ వెంటనే విడుదల చేయాలని, వారందరూ నామినేషన్లు వేసేందుకు తగిన పోలీసు భద్రత కల్పించాలని కోరారు.నామినేషన్ల గడువును కనీసం 48 గంటలు తగ్గకుండా పొడిగించాలని పిటిషన్‌లో అభ్యర్థించారు. నామినేషన్లు దాఖలు చేయడానికి అన్ని జిల్లా కార్యాలయాలతో పాటు కలెక్టరేట్లలోనూ తగిన ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. నామినేషన్లు వేస్తున్న అభ్యర్థులను టీడీపీ శ్రేణులు అడ్డుకుని, నామినేషన్ పత్రాలను చించేస్తూ భౌతిక దాడులకు పాల్పడుతున్నారని.. అటువంటి వారిపై కఠిన కేసులు నమోదు చేయాలని కోరారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save