Date of Publish : 23/10/2026, 9:11 pm
Editor : భవ్య జర్నలిస్ట్
ప్రశాంతంగా ముగిసిన జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ
- శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
శ్రీసత్యసాయి జిల్లా పరిధిలోని జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ సాయంత్రం 5:00 గంటలకు ప్రశాంతంగా ముగిసిందని జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని తెలిపారు.
ప్రస్తుతం అధికారులు నామినేషన్ల ప్రక్రియను క్రోడీకరిస్తున్నారు. ఏయే నామినేషన్లు దాఖలయ్యాయనే వివరాలు త్వరలోనే అధికారికంగా విడుదల చేయబడతాయి.
రేపు ఉదయం 8:00 గంటల నుండి జెడ్పీ కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన ప్రారంభమవుతుందని, అభ్యర్థులందరూ రేపు ఉదయం 8:00 గంటలకు జెడ్పీ కార్యాలయానికి చేరుకోవాలని సూచించారు.
ఉదయం 8:00 గంటల నుండి అధికారుల బృందం నామినేషన్లను పరిశీలించి, నిబంధనల ప్రకారం వాటిని ఆమోదించడం లేదా తిరస్కరించడం జరుగుతుందన్నారు.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.