Date of Publish : 23/10/2026, 9:15 pm
Editor : భవ్య జర్నలిస్ట్
కడప లో కేసు నమోదు
కడప నగరంలోని గాంధీనగర్ స్కూల్ సమీపంలో 17.10.2026వ తేదీ మధ్యాహ్నం సుమారు 12.15 గంటలకు జరిగిన దాడి ఘటనకు సంబంధించి కోన రమేష్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. అయితే, పై ఘటనకు సంబంధించి సుమారు 80 మంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సోషల్ మీడియా, టీవీ ఛానళ్లు మరియు ఇతర మీడియా వేదికల్లో ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం ఈ కేసు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున, ఈ నేరంలో ఎంతమంది నిందితులు పాల్గొన్నారు, వారి వ్యక్తిగత పాత్రలు ఏమిటి, దాడిలో వారు ఏ విధంగా పాల్గొన్నారు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత ఆధారాల ద్వారా నిర్ధారించడం జరుగుతోంది.
ఈ కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాము. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు ఆధారాలతో నిర్ధారణ అయిన వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకొనబడును. ప్రజలు నిర్ధారణ కాని సమాచారాన్ని, వదంతులను ప్రచారం చేయకుండా, పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని కోరుతున్నాము.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.