Global Vaartha
Date of Publish : 24/10/2026, 11:10 am
Editor : భవ్య జర్నలిస్ట్

ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించిన టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు.

  • 51వ డివిజన్‌లో ముమ్మరంగా కూటమి ప్రచారం..

కడప నగర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి మేయర్ అభ్యర్థి శ్రీమతి మట్లి సువర్ణ గారి గెలుపును కాంక్షిస్తూ టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు.

51వ డివిజన్ బిల్టాప్ సర్కిల్ సమీపంలోని పోలేరమ్మ గుడి వద్ద నుంచి కూటమి శ్రేణులతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ, డివిజన్‌లోని సమస్యలను తెలుసుకున్నారు.

కడప సమగ్రాభివృద్ధి, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ, స్వచ్ఛమైన తాగునీరు మరియు శాశ్వత రోడ్ల నిర్మాణం కూటమి పాలనతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. నగర సమగ్ర ప్రగతి కోసం మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి, కూటమి మేయర్ అభ్యర్థి మట్లి సువర్ణ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save