Global Vaartha
Date of Publish : 24/10/2026, 11:28 am
Editor : భవ్య జర్నలిస్ట్

ప్రత్యేక రైళ్లలో 25 వేలకుపైగా బెర్తులు ఖాళీ..

ప్రత్యేక రైళ్లలో 25వేలకుపైగా బెర్తులు ఖాళీగా ఉన్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. పండుగ సీజన్‌లో ప్రయాణికుల సౌలభ్యం కోసం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 10 మార్గాల్లో 42 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు. అక్టోబరు 25నుంచి నవంబరు 27వరకు నడిచే ఆయా ప్రత్యేక రైళ్లలో బెర్తులను అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ ద్వారా పొందవచ్చని ప్రయాణికులకు ఆయన సూచించారు.సికింద్రాబాద్‌-శ్రీకాకుళం మార్గంలో నడిచే ప్రత్యేక రైళ్లలో 5,700, చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య 2,700, సికింద్రాబాద్‌-నహర్‌లగున్‌ మార్గంలో 3,200, చర్లపల్లి-సత్రగచ్చి 500, చర్లపల్లి-బ్రహ్మాపూర్‌ మార్గంలో నడిచే రైళ్లలో 1,400 బెర్తులు ఖాళీ ఉన్నట్లు వెల్లడించారు. అలాగే, సికింద్రాబాద్‌-విశాఖపట్నం 700, జాల్నా-తిరుపతి 1600, నాందేడ్‌-తిరుచానూర్‌ 3300, చర్లపల్లి-నర్సపూర్‌ 2,000, సికింద్రాబాద్‌-కాకినాడ మార్గంలో 3,200 బెర్తుల లభ్యత ఉందన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save