Global Vaartha
Date of Publish : 24/10/2026, 3:04 pm
Editor : భవ్య జర్నలిస్ట్

న్యూజిలాండ్‌తో రెండో టీ20: భారత్ టార్గెట్ ఎంతంటే?

క్రిస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్-భారత్ జట్లు రెండో టీ20లో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. భారత్‌కు 181 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గ్లెన్ ఫిలిప్స్(70; 43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), జాకబ్స్(58; 46 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. మిగతా బ్యాటర్లంతా స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు.ఓపెనర్ టిమ్ సీఫర్ట్(7), ఫిన్ అలెన్(16), డారెల్ మిచెల్(6), మిచెల్ శాంట్నర్(4*), బ్రేస్‌వెల్(10) పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 2, భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి తలొక వికెట్ పడగొట్టారు. ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ ఇప్పటికే 1-0 తేడాతో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save