Global Vaartha
Date of Publish : 24/10/2026, 3:23 pm
Editor : భవ్య జర్నలిస్ట్

గ్రీకు రెస్టారెంట్‌లో తొలి పరిచయం.. రాజీవ్‌ గాంధీతో ప్రేమకథను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ..

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు సోనియా గాంధీ తన భర్త, మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీతో పరిచయాన్ని, ప్రేమకథను తాజాగా గుర్తు చేసుకున్నారు. ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్‌లో ఉన్న ఓ చిన్న గ్రీకు రెస్టారెంట్‌లో మొదటిసారి రాజీవ్‌ను కలిశానని, తొలి పరిచయంలోనే ఆయనతో కలిసి జీవించాలనే భావన తనలో కలిగిందని వెల్లడించారు. తన జీవిత కథ ఆధారంగా రాసిన 'బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌' పరిచయ వీడియోలో సోనియా ఈ వ్యక్తిగత జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ పుస్తకం నవంబర్‌ 10, 2026న విడుదల కానుంది (Sonia Gandhi Memoir).వర్సిటీ రెస్టారెంట్‌ అనే గ్రీకు హోటల్‌లో ఓ స్నేహితుడి ద్వారా రాజీవ్ పరిచయమయ్యారు. రాజీవ్‌ను మొదటిసారి చూసినప్పుడే ఆయనతో కలిసి ఉండాలనే భావన కలిగింది. తనకు కూడా అదే భావన కలిగిందని తర్వాత రాజీవ్‌ చెప్పారు. రాజీవ్‌‌లో కనిపించిన సౌమ్యత నన్ను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఆయన వ్యక్తిత్వంలోని ఆ మృదుత్వం తొలి పరిచయంలోనే నా మనసును తాకింది. దశాబ్దాల క్రితం జరిగిన ఆ పరిచయాన్ని ఇప్పటికీ మరిచిపోలేదు. మా అనుబంధం.. ప్రేమ, నవ్వులు, మధుర జ్ఞాపకాలతో నిండిన జీవితంగా మారింది' అని సోనియా పేర్కొన్నారు (Rajiv Gandhi Love Story).

సోనియా గాంధీ రాసిన 'బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌' పుస్తకం ఆమె చిన్ననాటి ఇటలీ జీవితం నుంచి రాజీవ్‌తో పరిచయం, వివాహం, కుటుంబ జీవితంతో పాటు రాజకీయ ప్రయాణం వరకు అనేక అంశాలను స్పృశించనుంది (Sonia Gandhi Book). ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీల హత్యలతో సహా తన జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తిగత విషాదాలను కూడా సోనియా ఇందులో వివరించనున్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని ఇప్పటివరకు ఎక్కువగా బహిరంగం చేయని సోనియా గాంధీ, ఈ పుస్తకం ద్వారా తన జీవితంలోని అనుభవాలను పాఠకులతో పంచుకునేందుకు సిద్ధమయ్యారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save